
Aamir Khan Interview:
బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్, తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియా దూరంగా ఉంచేవాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మొదటి భార్య రీనా దత్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఎదురైన మానసిక సమస్యల గురించి భావోద్వేగంగా చెప్పారు.
ఆమిర్ చెప్పారు – “రీథాతో విడిపోయిన రోజు రాత్రి నేను పూర్తిగా మద్యం తాగేశాను. ఆ తరవాత ఏడాది పాటు ప్రతిరోజూ తాగేవాన్ని. నిద్రపోకుండా, మద్యం మత్తులోనే పడుకునే దశకి వెళ్లిపోయాను. నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నట్టే అనిపించేది. అదే సమయంలో ‘లగాన్’ సినిమా వచ్చి, నేను ‘Man of the Year’ అవార్డు కూడా పొందాను”.
ఆమిర్, రీనా ప్రేమకథ చాలా బాగా మొదలైంది – ఇద్దరూ పొరుగింట్లో ఉండేవారు, ఇంటి కిటికీల్లో చూసుకుంటూ ప్రేమ పెరిగింది. మొదట రీనా ఆసక్తి చూపకపోయినా, చివరికి ఆమిర్ ప్రపోజల్‌కి ఒప్పుకుంది. తక్కువ మంది మధ్య వీరి పెళ్లి జరిగింది. ఆమె ‘కయామత్ సే కయామత్ తక్’లో చిన్న పాత్ర కూడా చేసింది. 16 సంవత్సరాల పాటు కలిసి జీవించిన ఈ దంపతులు, ‘లగాన్’ సినిమా తర్వాత ఏడాది విడిపోయారు.
ఆమిర్ తెలిపాడు – “మా విడాకులు మాకు, మా కుటుంబాలకు కూడా కష్టం కలిగించాయి. కానీ ప్రేమ, గౌరవం మాత్రం పోకుండా చూసుకున్నాం.”
తర్వాత ఆమిర్, దర్శకురాలు కిరణ్ రావుతో 2005లో పెళ్లి చేసుకున్నాడు. వారికొడుకు ‘ఆజాద్’ జన్మించాడు. కానీ 2021లో వారు కూడా విడిపోయారు. ఇప్పుడేమంటే, ఆమిర్ తన 20 ఏళ్ల స్నేహితురాలు గౌరి స్ప్రాట్‌తో రిలేషన్‌లో ఉన్నాడు.