HomeTelugu Trendingసింగర్‌ స్మిత ఫేస్ బుక్ హ్యాక్ .. అశ్లీల ఫొటోలు

సింగర్‌ స్మిత ఫేస్ బుక్ హ్యాక్ .. అశ్లీల ఫొటోలు

Singer Smitha Account Hacke

సోషల్ మీడియా సెలబ్రిట్స్‌ తరచు అకౌంట్స్ హ్యాక్ అవుతుండడం తరచూ గమనిస్తున్నాం. హ్యాక్ చేసిన తర్వాత సదరు అకౌంట్స్‌లో అశ్లీల ఫోటోలు, న్యూడ్ వీడియోలు దర్శనమిస్తుండడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. తాజాగా సింగర్ స్మిత ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్మిత ఒక్క సారిగా ఉలిక్కి పడింది. తన ఫేస్ బుక్ అకౌంట్‌లో అమ్మాయిలా న్యూడ్ పిక్స్ తో పాటు వీడియోలు దర్శనమిచ్చాయి. అది చూసి షాకైన స్మిత.. తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారనీ గ్రహించి వెంటనే సంబందిత అధికారులకు ఫిర్యాదు చేసింది. సింగర్ స్మిత తన ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయిందని ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

దీంతో అధికారులు స్మిత అకౌంట్‌ను పూర్వ స్థితికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్న సింగర్ స్మిత ఐయామ్ బ్యాక్ అంటూ తన ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా ఆమె రాస్తూ.. ‘అదో భయంకరమైన రోజని.. తన ఫేస్ బుక్‌ని హ్యాక్ చేసి స్టుపిడ్ కంటెంట్‌ పోస్ట్ చేశారని.. వాటి వల్ల ఎవరికైనా అసౌకర్యంగా ఫీల్ అయితే క్షమించాలని కోరింది. ఇక తన ఫేస్ బుక్ తిరిగి సాధారణ స్థితికి రావాడానికి సహకరించిన ఫేస్ బుక్ టీమ్‌కు ధన్యవాదాలు తెలిపింది స్మిత.

Recent Articles English

Gallery

Recent Articles Telugu