HomeTelugu Trendingతల్లి కాబోతున్న సింగర్‌ సునీత!

తల్లి కాబోతున్న సింగర్‌ సునీత!

Singer sunitha instagram po

సింగర్‌ సునీత.. గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక గతేడాది రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని హెడ్‌లైన్స్‌లో నిలిచిన సునీత పెళ్లి అనంతరం సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు.

లాక్‌డౌన్‌లో ప్రతి రోజు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. అంతేకాదు వారు అడిగిన పాటలను ఆలపించి వినోదాన్ని అందించారు సునీత. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. సాధారణంగానే ప్రకృతి ప్రేమికురాలైన సునీత ఈ మధ్యకాలంలో నేచర్‌కి సంబంధించిన పోస్టులు ఎక్కవగా షేర్‌ చేస్తున్నారు. గతంలో అరటీ తోటకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసిన ఆమె తాజాగా మామిడి తోటకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.

ఓ మామిడి చెట్టు దగ్గర కూర్చుని మామిడి కాయలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలకు సునీత బ్లెస్డ్‌ అనే క్యాప్షన్‌ జత చేసి పోస్ట్‌ చేశారు. ఇక దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సమ్మర్‌ స్పెషల్‌ మ్యాంగో అని, వావ్‌ సూపర్‌ మ్యాంగోస్‌ అంటూ కామెంట్ చేస్తుండగా మరికొందరు ఇలా ఏదైనా గుడ్‌న్యూస్‌ చెబుతున్నారా? మ్యామ్‌ అంటూ ఆరా తీస్తున్నారు. దీంతో సునీత్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ మొదటి వారం కలెక్షన్లు..!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!