‘పుష్ప’లో విలన్‌గా కోలీవుడ్‌ హీరో


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్‌లో బీజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా లాక్‌డౌన్‌ అనంతరం షూటింగ్ ప్రారంభమైంది. బన్నీతో సహా ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ స్మగ్లర్‌గా కనిపించనున్నారు. రష్మిక మందానా హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో విలన్‌ కోసం యూనిట్ కొద్దిరోజులుగా సర్చ్‌ చేస్తుందట. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో బాలీవుడ్ నటుడు విలన్‌‌గా అయితే బాగుంటుందని సుకుమార్‌ అనుకుంటున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం విలన్ రోల్ కోసం తమిళ నటుడు ఆర్యతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆర్య కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ వార్తే నిజమైతే బన్నీ-ఆర్య కాంబోను ప్రేక్షకులు మరోసారి చూడనున్నారు.కాగా 2010 గుణశేఖర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘వరుడు’ సినిమాలో బన్నీ హీరోగా, ఆర్య విలన్‌గా కనిపించారు. ఈ సినిమాలో బన్నీ, ఆర్య వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షలకును ఆకట్టుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates