HomeTelugu Trending'సార్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘సార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

sir movie release date
కోలీవుడ్‌ హీరో ధనుశ్.. తెలుగు ,తమిళ భాషల్లో ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే ‘సార్’ .. తమిళంలో ‘వాతి’ అనే పేరుతో విడుదల కానుంది. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఫిక్స్‌ చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా చెబుతూ, కొత్త పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో లెక్చరర్ పాత్ర పోషిస్తున్నప్పటికీ ధనుశ్ యాక్షన్ సీన్ లోనే కనిపిస్తుస్తుండడాన్ని పోస్టర్ లో చూడొచ్చు. విద్యా వ్యవస్థలోని సంస్కరణల దిశగా ఈ కథ ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అందులోని లోపాలను సరిచేసే క్రమంలోనే ఈ లెక్చరర్ యాక్షన్ లోకి దిగుతాడన్న మాట.

ఈ సినిమాకి వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా అలరించనుంది. సితార బ్యానర్ తో పాటు త్రివిక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

20221117fr63763214796b8

Recent Articles English

Gallery

Recent Articles Telugu