శిరీష్ హీరోగా సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం!

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ తో సూప‌ర్ హిట్ ఇచ్చిన త‌రువాత మంచి క‌థ‌ల‌తో ముందుకు వెలుతున్న అల్లు శిరీష్ హీరోగా, టైగ‌ర్ లాంటి స‌క్స‌స్‌ఫుల్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా త‌న టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.
 
ప్ర‌స్తుతం ఈచిత్రం యోక్క స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ హీరోగా ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి సూప‌ర్‌స‌న్సెష‌న‌ల్ మూవి తెర‌కెక్కుతుంది. ఈచిత్రం ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు పూర్తిచేస‌కుంది. ఈ చిత్రం త‌రువాత శిరీష్ హీరోగా చిత్రం సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. మ‌రిన్ని వివ‌రాలు అతిత్వ‌ర‌లో నిర్మాత‌లు తెలియ‌జేస్తారు
 
CLICK HERE!! For the aha Latest Updates