ఈ నెల 30 న ఆర్కే బీచ్ లో ‘F2’ సందడి

ఈ సంక్రాంతికి వరుణ్ తేజ్ తో కలిసి విక్టరీ వెంకటేష్ సంక్రాంతి అల్లుళ్లుగా ‘F2’ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని రెండు సింగిల్స్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఈ మూవీ ఆడియో వేడుకను డిసెంబర్ 30 వ తేదీ సాయంత్రం 6 గంటలకు వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తున్నది. తమన్నా, మెహరీన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.