అమితాబ్‌తో సూర్య భేటీ..?

బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన స్టార్‌ హీరో అమితాబ్.. ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కథ, పాత్రలో వైవిధ్యం.. ఉంటె చాలు సినిమాలో నటించేందుకు సిద్ధం అంటున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాలో గురువు పాత్రలో నటిస్తున్నారు. చారిత్రాత్మక నేపధ్యం కలిగిన సినిమా కావడంతో అమితాబ్ వెంటనే ఒప్పుకున్నాడు.

ఇప్పుడు తమిళ సినిమాలో కూడా అమితాబ్ కనిపించబోతున్నాడు. ఉర్యంద మనిదం (గ్రేట్ మ్యాన్) అనే సినిమాలో అమితాబ్ కనిపిస్తున్నారు. ఎస్.జే సూర్య ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా గురించిన కీలక విషయాలను చర్చిందేందుకు అమితాబ్ ను కలిశాడు సూర్య. ఈ సందర్భంగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.