
వైసీపీ పాలన అవినీతి పాలన అని, ఆంధ్ర రాష్ట్రంలోని స్కూల్ పిల్లలు కూడా రెండో ఎక్కం చెప్పినంత సులభంగా చెప్పేస్తున్నారు. మొత్తానికి జగన్ రెడ్డి రాక్షస పాలనలో అవినీతి మరకలు తప్ప.. అభివృద్ధి అడుగులు జాడ ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు. మరి బటన్ రెడ్డి చేసిన పాపాల్లో కొన్నిటిని ముచ్చటించుకుందాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలు మన రాష్ట్రంలోనే జగన్ రెడ్డి పాలనలోనే అధికంగా ఉన్నాయి. ఈ పెంచిన ధరలు, పన్నులతో ప్రజలపై పెనుభారం మోపారు మన బటన్ రెడ్డి.
దేశంలో రైతులపై అత్యధిక అప్పున్న రాష్ట్రం ఏదో తెలుసా ?, ఇంకేదీ ? మన బటన్ రెడ్డి సీఎం ఉండగా మరో రాష్ట్రం ఎందుకు ఉంటుంది. మన ఏపీనే. ఒక్కో రైతుపై సగటున రూ.2.42 లక్షల అప్పు ఉంది. ఇది బటన్ రెడ్డికి మాత్రమే సాధ్యమయ్యే ఘనత.
మొత్తానికి ఆంధ్రాలో ప్రతి రైతూ ఇప్పుడు అప్పుల్లో ఉన్నట్లే. అందుకే రైతు ఆత్మహత్యల్లో మన రాష్ట్రానిది మూడో స్థానం.. కౌలు రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం. జగన్ రెడ్డి అధికారికంలోనే 1,673 మంది రైతుల అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మనిషి అనే వాడు కనీసం ఆలోచిస్తాడు.. కానీ మన బటన్ రెడ్డి గోరు కనీసం ఈ విషయం పై ఆలోచన కూడా చేయడం లేదు.
రైతు నుంచి ఒక క్వింటా ధాన్యానికి 25 కేజీలు అదనంగా తీసుకుంటున్న మొట్ట మొదటి సీఎం కూడా మన బటన్ రెడ్డే. దీనికితోడు రేషన్ బియ్యం మొత్తం రీసైక్లింగ్ చేసి తరలిస్తున్నారు. రేషన్ బియ్యం ఇచ్చిన వెంటనే కలెక్ట్ చేసి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు.
కేంద్రం ఇచ్చిన బియ్యం కూడా పంపిణీ చేయని ఏకైక సీఎం కూడా మన బటన్ మోహన్ రెడ్డే. మీకు గుర్తుందా ?, ఆంధ్ర రాష్ట్రంలో బియ్యం తరలింపు జరిగిందన్న విషయాన్ని పార్లమెంట్లో స్వయంగా కేంద్ర మంత్రినే చెప్పారు.
ఇక ఈ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అన్ని చోట్లా గంజాయి, డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. ఎవరి వల్ల ?, ఒక్క మన బటన్ మోహన్ రెడ్డి వల్లే. ఇది ఒక్క బటన్ రెడ్డికి మాత్రమే సాధ్యం. దీనికితోడు మద్యం రేట్లు విపరీతంగా పెంచేశాడు. దాంతో తాగలేక…మందుబాబులు గంజాయికి అలవాటు పడ్డారు. ఇదంతా మన బటన్ రెడ్డి గోరి మాస్టర్ ప్లాన్.
గడిచిన మూడున్నరేళ్లలో రాష్ట్రంలో మహిళలపై 52 వేల దాడులు, వేధింపుల ఘటనలు జరిగాయి. ఒక్క నెల్లూరు లాంటి జిల్లాలో 11 మందిపై వివిధ రకాల అఘాయిత్యాలు జరిగాయి. ఇవన్నీ మీడియాలో రావు. వస్తే బటన్ రెడ్డి బ్యాన్ చేస్తాడు. మరి ప్రజలు ఎందుకు ప్రశ్నించలేదు. వాళ్లకు కూడా భయమే. ఏ పథకం ఆగిపోతుందో అని. ఇలాంటి దారుణ పరిస్థితులను క్రియేట్ చేసిన మొట్టమొదటి సీఎం కూడా మన బటన్ మోహన్ రెడ్డే.
ఇక ఈ మూడున్నరేళ్లలో 21 వేల మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగాలు లేవు. ఎక్కడ చూసినా నిరాశ నిస్పృహలు ఉన్నాయి. అందుకే ఆత్మహత్యలు పెరిగాయి. అయినా ఇప్పటికీ ‘7 వేల వాలంటీర్ జాబ్’, ’10 వేల చేపల కొట్టు జాబ్’ ఇస్తా అంటున్నాడు మన బటన్ రెడ్డి. బాబు హయాంలో ఐటీలో మేటిగా నిలిచిన యువత….నేడు నిస్సారంగా అయిపోయారు. ఎవరి మహిమ అది ?, మన బటన్ మోహన్ రెడ్డి గోరి మహిమ.
తనను ప్రశ్నించిన వారిపై దాడులు చేసి, అక్రమంగా కేసులు పెట్టడం.. జగన్ రెడ్డి ఆనవాయితీ . దాంతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతుంటే జగన్, అతని టీం మాత్రం ఆనంద పడుతుంటారు. మొత్తమ్మీద బాదుడు, విద్వేషాలు, విషాదాలు, విధ్వంసాలు.. ఇవి మన బటన్ మోహన్ రెడ్డి పాలన మహత్యాలు.













