చ‌లికాలంలో చెమ‌ట‌లు క‌క్కిస్తున్న సోనాక్షి.. హాట్‌ ఫొటోలు

సినిమా ఇండ‌స్ట్రీలో ఫాంలో ఉన్న‌పుడే విలువ.. ఒక్క‌సారి ఫ్లాపుల్లోకి వెళ్లారంటే అంతే సంగ‌తులు. అప్ప‌టి వ‌ర‌కు ప‌ల‌క‌రించిన వాళ్లు కూడా ప‌క్క‌కెళ్లిపోతారు. పాపం ఇప్పుడు సోనాక్షి సిన్హాకు ఇదే ప‌రిస్థితి ఉంది. ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్లుగా విజ‌యం కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తుంది. కెరీర్ కొత్త‌లో వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకొచ్చిన ఈ దబంగ్ బ్యూటీకి ఆ త‌ర్వాత ఒక్క హిట్ క‌రువు అయిపోయింది. వ‌ర‌స ఫ్లాపుల‌తో ప్రేక్ష‌కులు మ‌రిచిపోయే స్టేజ్‌కు వ‌చ్చేసింది ఇప్పుడు.

దాంతో త‌ను మళ్లీ గుర్తు చేయ‌డానికి అందాల ఆర‌బోత‌నే ఆయుధంగా వాడేస్తుంది సోనాక్షి. తాను కూడా ఏ వార‌సురాలికి త‌క్కువ కాద‌ని నిరూపిస్తూ.. అందాల నిధుల‌ను బ‌య‌ట‌పెడుతుంది ఈ భామ‌. ఆ మ‌ధ్య మాల్దీవుల్లో మ‌జా చేస్తూ.. అక్క‌డ్నుంచి చ‌లికాలంలోనే చెమ‌ట‌లు క‌క్కించింది సోనాక్షి. ఇక ఇప్పుడు మ‌రోసారి బ్లాక్ క్యాస్ట్యూమ్స్ వేసుకుని అందాల బ్లాక్ బ‌స్ట‌ర్ చూపించింది. క‌సి పుట్టించే చూపుల‌తో అందాల వ‌లేసి కుర్రాళ్ల గుండెల్ని బెలూన్స్ లాగా పేల్చేసింది సోనాక్షి. కొన్నేళ్లుగా ఐటం సాంగ్స్.. చిన్న సినిమాల‌తో స‌రిపెట్టుకుంటుంది సోనాక్షి.

ప్ర‌స్తుతం ఈ భామ చేతిలో రెండు సినిమాలున్నాయి. కర‌ణ్ జోహార్ నిర్మాణంలో అభిషేక్ వ‌ర్మ‌న్ తెర‌కెక్కిస్తున్న క‌లంక్ సినిమాలో న‌టిస్తుంది సోనాక్షి. ఈ సినిమాలో మాధురి దీక్షిత్.. వ‌రుణ్ ధావ‌న్.. సంజ‌య్ ద‌త్ కూడా న‌టిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు స‌ల్మాన్ ఖాన్ ద‌బంగ్ 3లో కూడా సోనాక్షినే న‌టించ‌నుంది. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. అప్ప‌టి వ‌ర‌కు కలంక్ ఒక్క‌టే సోనాక్షికి అండ‌. ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటే ఫోటోషూట్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది సోనాక్షి సిన్హా.