HomeTelugu Big Stories'బిగ్‌బాస్‌-4' విన్నర్‌ ఇతనేనా?

‘బిగ్‌బాస్‌-4’ విన్నర్‌ ఇతనేనా?

Bigg Boss 4 Winner goes vir 1తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-4 చివరి దశకు చేరుకుంది. ఇక నాలుగు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ సీజన్‌లో విన్నర్‌ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలో అభిజిత్‌ పేరు బాగా వినిపిస్తుంది. ఇంటి సభ్యులు కూడా అభికి బాగా సపోర్ట్‌ చేస్తున్నారు. మెహాబూబ్‌ కూడా ఎలిమినేట్‌ అయిన తరువాత అభి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభి చాలా మంచివాడు అని. నేను సోహైల్‌తో పాటు అభితో కూడా చాలా క్లోజ్‌గా ఉండేవాడిని అని, నన్ను తమ్ముడిలా చూసుకునే వాడు అని, తన ఫుడ్‌, ఛపాతీ తప్ప నాకు ఇచ్చేసేవాడు అని చెప్పాడు. అయితే బిగ్‌బాస్‌ అభితో ఉన్న క్లిప్స్‌ చూపించలేదు అన్నాడు. మొన్న ఎలిమినేట్‌ అయి లాస్య సైతం అభిజిత్‌ గురించి పాజిటివ్‌గా మాట్లాడింది. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌లోని కొందరు కుటుంబ సభ్యులు కూడా తమకు అభి అంటే ఇష్టం అంటూ స్వయంగా చెప్పడం జరిగింది. ప్రేక్షకులను అభి ఎలా మాయ చేశాడు అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా సింపుల్ గా కనిపించినా కూడా ప్రతి టాస్క్ లో కూడా లోతుగా ఆలోచించే వ్యక్తిత్వం అతడిది అంటూ ఇతరులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లే బిగ్‌బాస్‌-4 విన్నర్‌ ఇతనే అంటూ అభిప్రాయపడుతున్నారు.

Bigg Boss 4 Winner 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu