HomeTelugu Trendingతెలంగాణలో సోనూ సూద్‌కు గుడి.. ఫొటోలు వైరల్‌

తెలంగాణలో సోనూ సూద్‌కు గుడి.. ఫొటోలు వైరల్‌

Sonu sood temple constructe
బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్… సినిమాల్లో విలన్‌ పాత్రలు చేస్తూన్నప్పటికి.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా మారాడు. లాక్‌డౌన్ సమయంలో ప్రజల కోసం సోనూ సూద్ చేసిన సేవ అతన్ని గొప్ప వ్యక్తిగా నిలిపింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది సోనూను అభినందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో సోనూకు ఏకంగా గుడిని నిర్మించారు.

సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తాండా పరిధిలోని చెలిమితాండాలో రాజేశ్ అనే అభిమాని విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేశ్ కు సోనూ సూద్ అంటే ఎంతో అభిమానం. సోనూ చేసిన సేవా కార్యక్రమాలతో అభిమానం మరింతగా పెరిగింది. దీంతో సొంత ఖర్చుతో ఆయనకు గుడి నిర్మించాడు. నిన్న సోనూ విగ్రహానికి రాజేశ్ తో పాటు స్థానికులు కూడా పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu