సౌందర్య పెళ్లికి భద్రత కోరిన లతా రజనీకాంత్‌!

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ నటుడు, ఓ ఫార్మా కంపెనీ యజమాని అయిన విషగన్‌ వనగమూడిని సౌందర్య పెళ్లాడబోతున్నారట. గతేడాది సన్నిహితులు, కుటుంబీకుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది. ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు పెళ్లి వేడుకలు జరగనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రచారంపై రజనీకాంత్‌ కుటుంబం స్పందించలేదు.

కాగా లతా రజనీకాంత్‌ భద్రత కావాలని పోలీసుల్ని కోరారట. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 12 వరకు పోయెస్‌ గార్డెన్‌కు భద్రత కల్పించాలని ఆమె తేనంపేట్‌ పోలీసు స్టేషన్‌కు శనివారం లేఖ పంపారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు చెప్పారు. కానీ భద్రత ఎందుకు అనే విషయాన్ని లత స్పష్టంగా వెల్లడించలేదని అన్నారు. ఆ రోజు పలువురు ప్రముఖులు పోయెస్‌ గార్డెన్‌లోని రజనీ ఇంటికి రానున్నట్లు తెలిసింది.