2 నిమిషాల సీన్‌ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టిన శంకర్‌!

ప్రముఖ దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీబడ్జెట్‌తో ఉంటుంది. ఇటీవలే వచ్చిన 2పాయింట్ 0 సినిమాలో యంతర లోకపు సుందరివే అనే సాంగ్ కోసం ఏకంగా రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ బడ్జెట్ తో ఓ మంచి సినిమా చెయ్యొచ్చు. 2పాయింట్ 0 సూపర్ హిట్ కావడంతో శంకర్ నెక్స్ట్ భారతీయుడు2 పై దృష్టి సారించారు.

ఈ సీక్వెల్స్‌లో కూడా కమల్‌ లే హీరోగా నటిస్తున్నారు. వియాత్నంలో ఈ సినిమాకు అంకురార్పణ జరిగింది. ఈ మూవీ కోసం ఇటీవలే సెట్స్ నిర్మాణాలు కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో ఓ సీన్ ఉంటుందట. ఆ సీన్ కోసం బంగారు రంగులో ఉండే సెట్స్ ను నిర్మించినట్టుగా తెలుస్తున్నది. ఈ సీన్ రెండు నిమిషాలే ఉంటుందని, అయినప్పటికీ భారీతనం కోసం రెండు కోట్లు ఖర్చు చేసి బంగారు వర్ణంలో ఉండే బిస్కెట్స్ తో సెట్‌ను నిర్మించారని, ఆ సెట్‌ లోపలికి వెళ్తే.. బంగారం గనిలో ఉన్నట్టుగా ఉంటుందని అంటున్నారు. మరి ఆ సెట్ ఏంటో.. ఆ సీన్ ఏంటో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

CLICK HERE!! For the aha Latest Updates