HomeTelugu Big Storiesతమన్నా 'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్‌లుక్‌

తమన్నా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్‌

2 21
మిల్కీ బ్యూటీ తమన్నా.. హీరోయిన్‌గా నటిస్తూనే.. మరోపక్క కొన్ని చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసేందుకు సై అంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘అల్లుడు శీను’, ‘జై లవకుశ’ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో ఉర్రూతలూగించిన తమన్నా మరోసారి సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో మెరవనున్నారు. శనివారం తమన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం తమన్నాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది.

‘అందమైన, సూపర్‌ టాలెంటెడ్‌ తమన్నాకు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. మరోవైపు పలువురు సెలబ్రిటీలు సైతం ట్విటర్‌, ఇన్‌స్టా వేదికగా తమన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమన్నా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. తమన్నాతో దిగిన పలు ఫొటోలను సైతం పంచుకున్నారు.

‘పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్మి. నీకంతా మంచే జరగాలని, నీ చుట్టూ ఉండేవాళ్లలో ఎప్పుడూ సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాను.’ కాజల్‌

‘ఎంతో అందమైన తమన్నాకు జన్మదిన శుభాకాంక్షలు. కష్టపడేతత్వానికి, అంకితభావానికి నువ్వు నిదర్శనం. నువ్వు కోరుకునే ప్రతీది జరగాలని ఆశిస్తున్నాను.’ సమంత

Recent Articles English

Gallery

Recent Articles Telugu