HomeTelugu Trendingశివరాత్రికి శర్వా 'శ్రీకారం'

శివరాత్రికి శర్వా ‘శ్రీకారం’

Sreekaram release on marc
టాలీవుడ్‌ యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ ‘శ్రీ‌కారం’‌‌. కిశోర్ బి. ద‌ర్శ‌క‌త్వం వస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 14 రీల్స్ ప్ల‌స్‌ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి 11న ‘శ్రీ‌కారం’ సినిమాని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు శ‌నివారం చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా విడుదల తేదీతో పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో గ‌ళ్ల లుంగీ, కాట‌న్ ష‌ర్ట్‌, భుజాన కండువాతో న‌వ్వుతూ నిల్చొని ఉన్న శ‌ర్వానంద్ క‌నిపిస్తున్నారు. ‘గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న‌ రెండో చిత్రం ‘శ్రీ‌కారం’.

Recent Articles English

Gallery

Recent Articles Telugu