HomeTelugu Trending'రాజరాజచోర' టీజర్‌ వచ్చేసింది

‘రాజరాజచోర’ టీజర్‌ వచ్చేసింది

Raja Raja Chora Teaser
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజరాజచోర’. హసిత్‌ గోలి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో మేఘాఆకాశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది మూవీ యూనిట్‌. ఈ టీజర్‌లో శ్రీవిష్ణు.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని చెప్పుకునే దొంగగా కనిపించనున్నారు.

ప్రముఖ నటుడు రవిబాబు ఇందులో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాడు. అలాగే.. గంగవ్వ, తమిళ నటి సునైనా ఇందులో కీలకపాత్రలు పోషించారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu