HomeTelugu Trendingబాలయ్యపై శ్రీలీల ప్రశంసలు

బాలయ్యపై శ్రీలీల ప్రశంసలు

Bhagavanth Kesari first sin

టాలీవుడ్‌లో ప్రస్తుతం యంగ్‌ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. చిన్న వయసులోనే అటు స్టార్‌ హీరోలతో ఇటు యంగ్‌ హీరోలతో నటిస్తుంది. తాజాగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న’భగవంత్‌ కేసరి’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య, శ్రీలీల బాబాయ్‌, కూతుళ్లుగా నటించారు. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది.

‘భగవంత్‌ కేసరి’ విశేషాలు, బాలయ్యతో కలిసి నటించడంపై శ్రీలీల స్పందిస్తూ.. బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన తనకు సొంత బాబాయ్‌లాగే అనిపించారని చెప్పింది.

సెట్ లో బాలయ్య సైతం తనను అలాగే చూసుకున్నారని చెప్పింది. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్యతో నటించాలని ఉన్నట్టు తెలిపింది. ఇక, సెట్‌లో సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి తాను ఫిదా అయిపోయానని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!