అల్లు అర్జున్‌తో శ్రీలీల

టాలీవుడ్ లో ప్రస్తుతం శ్రీలీల హావా నడుస్తుంది. ‘పెళ్లిసందD’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. హిట్స్, ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా స్టార్‌ డైరెక్టర్స్‌, నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో స్టార్ హీరోల సరసన ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఏకంగా ఎనిమిది సినిమాలున్నాయి.

వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఆదికేశవ విడుదలకు సిద్ధంగా ఉంది. బోయపాటి శ్రీను-పోతినేని రామ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం, నితిన్ 32వ సినిమాలో, బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి, విజయ్ దేవరకొండ 12వ సినిమా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబు గుంటూరు కారం, ఓ కన్నడ సినిమాలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు మరో భారీ ఆఫర్ ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ నిర్మిస్తున్న సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జంటగా నటించే చాన్స్ శ్రీలీల కొట్టేసింది. ఈ విషయాన్ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. ఓ స్టెప్పులో బన్నీపైన ఆమె కూర్చున్న క్యూట్ పోస్టర్ ను సైతం విడుదల చేసింది. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates