HomeTelugu Big Storiesవిన్నర్‌ కంటే శ్రీముఖికి ఎక్కువ పారితోషికం ఇచ్చిన బిగ్‌బాస్‌

విన్నర్‌ కంటే శ్రీముఖికి ఎక్కువ పారితోషికం ఇచ్చిన బిగ్‌బాస్‌

4 5తెలుగు ‘బిగ్‌బాస్‌ 3’ టైటిల్‌ విన్నర్‌ రాహుల్‌ కంటే ఎక్కువ మొత్తం రన్నరప్‌గా నిలిచిన శ్రీముఖి రెమ్యూనరేషన్‌ రూపంలో ఇంటికి తీసుకువెళ్లిందని సమాచారం. బిగ్‌బాస్‌ విజేతతో పోలిస్తే హౌస్‌లో ఉన్నన్ని రోజులు శ్రీముఖికి పారితోషికంగా భారీ మొత్తమే నిర్వాహకులు ముట్టజెప్పారని భావిస్తున్నారు. టీవీ యాంకర్‌గా రెండు తెలుగురాష్ట్రాల్లో పేరున్న శ్రీముఖి బుల్లితెరపై హయ్యస్ట్‌ పెయిడ్‌ నటిగా గుర్తింపు పొందడంతో బిగ్‌బాస్‌ షోలోనూ భారీగా రాబట్టారు.14 మంది కంటెస్టెంట్లలో ఒకరిగా బిగ్‌బాస్‌ తెలుగు 3 హౌస్‌లో అడుగుపెట్టిన శ్రీముఖి ఏకంగా 105 రోజుల పాటు హౌస్‌లో కొనసాగడంతో పాటు టాప్‌ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. గ్రాండ్‌ ఫినాలేలో టైటిల్‌ను రాహుల్‌ సిప్లీగంజ్‌ ఎగరేసుకుపోవడంతో ఆమె రన్నరప్‌గా మిగిలారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌గా రాహుల్‌కు రూ 50 లక్షలు దక్కగా శ్రీముఖి అంతకుమించే ఈ షోలో ఆర్జించారని వినికిడి. భారీ పే చెక్‌తో శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చారని సమాచారం.

బుల్లితెరపై తిరుగులేని యాంకర్‌గా సత్తా చాటిన శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు రోజుకు రూ లక్ష డిమాండ్‌ చేసినట్టు చెబుతున్నారు. ఆమె పాపులారిటీకి ఫిదా అయిన నిర్వాహకులు షోకు సైన్‌ చేసేముందు పునరాలోచన లేకుండా ఆమె అడిగిన మొత్తం ఇచ్చేందుకు అంగీకరించారని తెలిసింది. 105 రోజులు బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి కొనసాగడంతో కాంట్రాక్టు ప్రకారం రూ 1.05 కోట్ల చెక్‌ ఆమెకు దక్కింది. టైటిల్‌ విజేత రాహుల్‌ సహా ఇతర హౌస్‌మేట్స్‌తో పోలిస్తే ఆమె రెమ్యూనరేషన్‌ చాలా అధికం కావడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu