Nagarjuna New Car Price:
టాలీవుడ్ స్టార్లు తమ లగ్జరీ లైఫ్‌స్టైల్ విషయంలో ఈ మాత్రం తీసిపోరు. తాజాగా వీరి ఆటోమోటివ్ కలెక్షన్ లలోకి లెక్సస్ కార్లు బాగా ట్రెండ్‌గా మారాయి. ఇప్పటి వరకు స్టార్ హీరోలు ఎక్కువగా రేంజ్ రోవర్ ఎస్‌యూవీలు వినియోగించేవారు. కానీ ఇప్పుడు లెక్సస్ బ్రాండ్ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున లెక్సస్ బ్రాండ్‌కు చెందిన హైఎండ్ మోడల్‌ను కొనుగోలు చేశారు. “వీఐపీ” అనే పేరుతో ఉన్న ఈ కార్ రూ. 2.46 కోట్లు (ఎక్స్‌షోరూమ్ ధర) కాగా, ఆన్ రోడ్ ధర సుమారు రూ. 2.80 కోట్లుగా ఉంది.
నాగార్జున స్వయంగా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత తన కొత్త లగ్జరీ వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లారు.
King Nag at RTA office for his latest #Lexus registration #Nagarjuna 👑👑👑 pic.twitter.com/uB2cJ5d8Fg
— Nag Mama Rocks (@SravanPk4) November 28, 2024
ఇదివరకు రామ్ చరణ్ కూడా ఈ లెక్సస్ మోడల్‌ను ఇప్పటికే వినియోగిస్తూ కనిపించారు. చరణ్ మాదిరిగానే ఇప్పుడు టాలీవుడ్‌లో మరెంతో మంది స్టార్లు ఈ బ్రాండ్‌ను పరిశీలిస్తున్నారు.
రేంజ్ రోవర్, టయోటా వెల్‌ఫైర్ లాంటి కార్లు గతంలో స్టార్ హీరోల ఫేవరెట్‌గా ఉండేవి. కానీ ఇప్పుడు చిరంజీవి, రానా, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రవి తేజ లాంటి స్టార్ హీరోలు లెక్సస్ కార్లను ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. వీరి లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను సూచించే కార్లలో లెక్సస్ తాజాగా ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తోంది.
అద్భుతమైన డిజైన్, హైఎండ్ ఫీచర్లతో లెక్సస్ వాహనాలు హీరోల దృష్టిని ఆకర్షించాయి. టాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్ ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.
ALSO READ: Bigg Boss 8 Telugu ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్!