HomeTelugu Trendingషాకిస్తున్న 'శ్రీముఖి' బిగ్‌బాస్‌ పారితోషకం!

షాకిస్తున్న ‘శ్రీముఖి’ బిగ్‌బాస్‌ పారితోషకం!

1 29
తెలుగు అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్-3’ సీజన్ ఆసక్తికరంగా సాగుతున్నది. 15 మంది సెలెబ్రిటీలు పాల్గొన్న ఈ గేమ్ లో హేమ ఇప్పటికే ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. హేమ ఎలిమినేట్ తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా ఈ షోలో ఎంట్రీ ఇచ్చింది. కాగా బిగ్ బాస్ 3 వందరోజులపాటు 15 మంది సెలెబ్రిటీలు హౌస్ లో ఉండి గేమ్ ఆడానున్నారు. ఈ గేమ్ లో చివరి వరకు ఎవరు నిలుస్తారో వారే షో విజేతగా నిలుస్తారు.

గతంలో కంటే ఈ షోను మరింత కలర్ఫుల్ గా నిర్వహించేందుకు వివిధ రంగాల్లో పేరున్న వ్యక్తులను ఈ షోలో పాల్గొనే విధంగా చేశారు. ఇందులో యాంకర్ శ్రీముఖి కూడా ఒకరు. శ్రీముఖి టివి రంగంలో టాప్‌ యాంకర్ గా దూసుకుపోతున్నది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి కూడా అడుగుపెడుతున్న శ్రీముఖిని బిగ్‌బాస్ షోలో తీసుకోవడానికి మూడు కోట్ల రూపాయలకు పైగా అఫర్ చేశారని తెలుస్తోంది. ఇది చాలా పెద్ద ఎమౌంట్ అనే చెప్పాలి. శ్రీముఖికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా ఈ మొత్తాన్ని ఆమెకు ఆఫర్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu