HomeTelugu Trendingక్రిష్‌, పవన్‌ కల్యాణ్‌ సినిమాపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

క్రిష్‌, పవన్‌ కల్యాణ్‌ సినిమాపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

3 12
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ సినిమాపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. పవన్ కు ఈ సినిమా బాగా నచ్చిందని ఎప్పటినుంచో రీమేక్ చేయాలనుకుంటున్నాడు అని తెలియజేసాడు. అయితే పవన్ ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు నాగబాబు. అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయాన్ని వెల్లడించాడు. అయితే ఈ సినిమాలో పవన్ మొగలాయిల కథ చేస్తున్నాడని చెప్పాడు. ఈ సినిమా మొగలాయిల కాలం నాటి కథ అని.. సినిమా అంతా కోహినూర్ వజ్రం చుట్టూ కథ నడుస్తుందని ముఖ్యమైన విషయాలను బయటపెట్టాడు. ఈ సినిమా చూసిన తరువాత పవన్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్తున్నాడు. అయితే క్రిష్ కూడా ఈ సినిమాను పవర్ స్టార్ స్థాయికి తగ్గట్టుగానే సిద్ధం చేస్తున్నాడట..! ఇక నాగబాబు చెప్పిన తరువాత ఈ సినిమా పై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu