HomeTelugu Trendingమరోసారి ఆ ప్రొడ్యూసర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

మరోసారి ఆ ప్రొడ్యూసర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి

11 4టాలీవుడ్ లో సంచలన కామెంట్స్ తో నిత్యం వార్తల్లో ఉండే శ్రీరెడ్డి. తాజాగా మరోసారి ఓ మెగా ప్రొడ్యూసర్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్లు చేసింది. సోషల్ మీడియా వేదికగా తన డేట్స్, అలాగే ప్రమోషన్స్ చూడాలంటూ కొంటెగా కామెంట్ చేసి మంట పెట్టేసింది. గతంలో ఈ ప్రొడ్యూసర్‌ కుటుంబాన్నే టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా అదే ప్రొడ్యూసర్‌ను ఎంపిక చేసుకొని కామెంట్స్ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇదిలా ఉంటే నిత్యం వివాదాస్పద ట్వీట్లు, వీడియోలతో కాలం వెళ్లబుచ్చే ఈ భామ తాజాగా ఫ్యాషన్ రంగంలో కూడా రచ్చ చేసేందుకు సిద్ధం అయిపోయింది. ఇటీవలే ఓ ర్యాంప్ షో కూడా నిర్వహించి తన అందాలను చూసుకోమని సెగలు రేపింది. అలాగే అటు కోలివుడ్ లో సైతం నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఈ భామ బిజీగా మారడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu