శ్రీహరి కొడుకు సినిమా టీజర్ వచ్చేసింది..!


దివంగత నటుడు శ్రీహరి, డిస్కో శాంతి దంపతుల పెద్ద కొడుకు మేఘాంశ్‌ శ్రీహరి హీరోగా తొలి సినిమా “రామ్‌ధూత్‌” రూపొందుతోంది. ఈ సినిమా ద్వారా కార్తిక్‌, అర్జున్‌ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవితా రాజశేఖర్‌ హాజరయ్యారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు.

సునీల్ డైలాగ్‌తో ‘ట్రైలర్ ప్రారంభమవుతుంది. “ఒక అందమైన ఊరు. అందులో ఓ అద్భుతమైన షెడ్డు. దాంట్లో పనిచేయని రేడియో, తిరగలేని టైరు, సౌండ్‌ చేయని సైలెన్సర్‌.. వీటన్నింటి మధ్య తిరుగులేని నేను.. అంటూ సునీల్‌ డైలాగ్‌ చెబుతాడు. ఇందులో సునీల్‌ బైక్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ‘అయ్య బాబోయ్‌.. వీళ్లంతా ఎవరు? నా కథలోకి ఎంటర్‌ అయ్యారేంటి?’ అంటూ సునీల్ అనడం సరదాగా అనిపిస్తుంది. ‘ఇందుకే అంటారు అమ్మాయిలకు దిల్లీ, అబ్బాయిలకు పెళ్లి సేఫ్‌ కాదని.. అని మేఘాంశ్‌ డైలాగ్‌ చెప్పే తీరు ఆకట్టుకుంది. బైక్ అంటే ఇష్టపడే ఓ యువకుడి కథ. రాజ్‌దూత్ బైక్ అంటే ఇష్టపడే యువకుడు ఆ బైక్ కోసం ఎక్కడెక్కడికో తిరుగుతాడు. చివరికి ఆ బైక్ ఉన్న చోటు తెలుసుకొని కొనుగోలు చేస్తాడు. ఆ బైక్ వలన కలిగిన ఇబ్బందులు ఏంటి.. సమస్యలు ఏంటి అన్నది కథ. ప్రస్తుతం ఈ టీజర్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో 17వ స్థానంలో ఉండటం విశేషం.