HomeTelugu Trending'అఘోర'గా జగపతిబాబు!

‘అఘోర’గా జగపతిబాబు!

Jagapathi babu interesting
టాలీవుడ్‌ నటుడు జగపతిబాబు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘అఖండ’ సినిమాలో చేస్తున్నాడు. ఈసినిమాలో జగ్గుబాయ్‌ ‘అఘోర’గా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి డైరెక్షన్‌లో బాలయ్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘అఖండ’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు తమిళనాడులో జరుగుతోంది. బాలకృష్ణ తదితరులపై అక్కడ క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్‌ పార్టును పూర్తిచేసుకోనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉంటుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జగపతిబాబు కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనీ, అఘోర ఎపిసోడ్ లో ఆయన కనిపిస్తాడని అంటున్నారు. అఘోర పాత్రలో ఉన్న బాలయ్యకి ఆయన మార్గదర్శిగా కనిపిస్తాడని చెబుతున్నారు. ఇందులో నిజం ఎంతుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu