Homeతెలుగు Newsశ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్

శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు’ మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్

pedakapu trailer date

‘పెదకాపు’ మూవీ ట్రైలర్ రిలీజ్‍కు డేట్ ఫిక్స్ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంట్లో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. శ్రీకాంత్ అడ్డాల డైలాగ్‍లు వాయిస్ ఓవర్‌గా ఉన్న వీడియోను పోస్ట్ చేశారు.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో ‘పెదకాపు’ మూవీ రూపొందుతోంది. ఇందులో హీరోగా కొత్త నటుడు విరాట్ కర్ణ పరిచయమవుతున్నాడు. పెదకాపు మూవీ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ చేసింది చిత్రబృందం. వర్గపోరు, కులాల ఆధిపత్య పోరాటాలు, రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో అలరించిన శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప చిత్రంతో రూట్ మార్చి యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ‘పెదకాపు’ చిత్రాన్ని ఇంటెన్స్ స్టోరీతో రూపొందిస్తున్నారు. అణచివేతను ఎదిరించి నాయకుడిగా ఎదిగే ఓ సామాన్యుడి కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

పెదకాపు ట్రైలర్‌ను సెప్టెంబర్ 11వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 29న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇంటెన్స్ యాక్షన్‍తో ఉన్న టీజర్‌తోనే పెదకాపు మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. విరాట్ కర్ణ లుక్ కూడా బాగుంది. సామాన్యుడి సంతకం అంటూ ఈ చిత్రం వస్తోంది. ఈ మూవీలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ పాత్ర చేశారు. ఇంకా ప్రగతి శ్రీవాత్సవ, నాగబాబు, రావు రమేశ్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఈశ్వరి రావు ఇతర పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!