‘ఎన్టీఆర్’ బయోపిక్‌ గురించి స్టార్ ప్రొడ్యూసర్ ఏమన్నారంటే..!!


నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 21 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఆ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు సినిమాలో నటించిన నటీనటులు అందరు హాజరైయ్యారు. ఈ ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఎన్టీఆర్ దిగివచ్చి తెరపై మళ్ళి నటించారా అన్నట్టుగా అనిపించింది. కొన్ని షాట్స్ లో బాలకృష్ణ అచ్చంగా ఎన్టీఆర్‌ను తలపించాడు. ఈ ట్రైలర్ గురించి సెలెబ్రిటీలు తమ అభిప్రాయాలను ఇప్పటికే తెలియజేశారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ట్రైలర్ గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు.

“ట్రైలర్ అద్భుతంగా ఉంది. అన్నగారి చరిత్రను తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బాలకృష్ణకు.. యూనిట్ కు శుభాకాంక్షలు” తెలియజేశారు. ఈ సినిమా జనవరి 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.