HomeTelugu Trendingఅసురన్‌ దర్శకుడు మారాడు.!

అసురన్‌ దర్శకుడు మారాడు.!

5 14తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌ తెలుగులో రీమేక్ చేయనున్నారు.. తమిళంలో అసురన్ సూపర్, డూపర్ హిట్ కావడమే కాదు.. ధనుష్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది… ఇక, మూవీని తెలుగులో రీమేక్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు.. రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారు. అయితే, ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నారు. ఈ ప్రాజెక్టును దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తారనే టాక్ టాలీవుడ్‌లో నడిచింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ అడ్డాల చేతికి ఈ సినిమా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక, మూవీలో వెంకటేష్‌ సరసన అనుష్కను హీరోయిన్‌గా పెడితే బాగుంటుందనే యోచనలో ఉన్నారు మేకర్స్.. అయితే, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుపుణుల, నటీనటులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu