‘హలో గురు ప్రేమ కోసమే’ మూవీ ఆడియో వేడుక లేదు!

యంగ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. త్రినాథ్ రావ్ నక్కిన ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ఎలాంటి ఆడియో వేడుక ఉండదని, పాటల్ని నెరుగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

ఇక అభిమానుల కోసం ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహిస్తారట. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.