HomeTelugu Trendingబాలయ్యకు విలన్‌గా చిరంజీవి తమ్ముడు

బాలయ్యకు విలన్‌గా చిరంజీవి తమ్ముడు

1 15
టాలీవుడ్‌ నటుడు.. జగపతి బాబు కెరీర్ ఇక అయిపోయిందనుకున్న సమయంలో బోయపాటి పుణ్యమా అంటూ పవర్ఫుల్ విలన్ గా అవతరించాడు. అప్పటికే హీరో, హీరోయిన్ల తండ్రి పాత్రలు చేస్తూనే లెజెండ్ సినిమా నుండి స్టైలిస్ట్ విలన్ గా మారాడు. నిజానికి లెజెండ్ సినిమాలో విలన్ గా చేయడం అతని కెరీర్ ని ఊహించని మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆయన విలన్ గా కొన్ని సినిమాలు వచ్చినా లెజెండ్ ఎప్పటికీ ఆయనకు మెమరబుల్ అంతే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్యతో ఇప్పుడు మరో సినిమా తెరకేక్కిస్తున్నాడు బోయపాటి.

గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాలో మరో ఫ్యామిలీ హీరోను విలన్ గా మారుస్తున్నాడని సమాచారం. బోయపాటి సినిమాల్లో హీరో ఎంత బలంగా ఉంటాడో విలన్ కూడా అంతే పొగరుగా ఉంటాడు. అందుకే, ఆయన సినిమాల్లో హీరో పాత్రలు బాగా ఎలివేట్ అవుతాయి. ఈ సినిమా ద్వారా మెగాస్టార్ ను సొంత అన్నగా భావించే శ్రీకాంత్‌ను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. ఆయన ఇప్పటికే యుద్ధం శరణం సినిమాలో విలన్ గా కనిపించాడు. అయితే ఈ సినిమాలో నటించే విషయం మీద ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

1a 2

Recent Articles English

Gallery

Recent Articles Telugu