HomeTelugu Trendingఈనెల 27న శ్రీనివాసరెడ్డి 'హౌస్‌ అరెస్ట్‌'

ఈనెల 27న శ్రీనివాసరెడ్డి ‘హౌస్‌ అరెస్ట్‌’

Srinivas reddy house arrest
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ నెల 27న విడుదల కాబోతోంది. సినిమా పంపిణీ రంగంలో ఉన్న కె. నిరంజన్ రెడ్డి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలియత్నంగా ‘హౌస్ అరెస్ట్’ మూవీని నిర్మించారు. ’90 ఎం. ఎల్.’ దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్రా డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో శ్రీనివాసరెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషించగా రవిబాబు, ‘అదుర్స్’ రఘు, రవిప్రకాశ్, తాగుబోతు రమేశ్, ఫ్రస్టేటెడ్ సునైన, కౌశిక్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయమని కొందరు సలహా ఇచ్చినా, కాదని థియేట్రికల్ రిలీజ్ కే తాము సిద్ధపడ్డామని నిర్మాత తెలిపారు. ఈ నెల 27న ఈ వినోదాత్మక చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి జె. యువరాజ్ సినిమాటోగ్రఫీని అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu