ఫన్నీగా ‘హౌస్‌ అరెస్ట్‌’ టీజర్‌

టాలీవుడ్‌ హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రఘు, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు నటిస్తున్న చిత్రం ‘హౌస్‌ అరెస్ట్‌’. ’90ఎంఎల్’ దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజాగా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ టీజర్లో దొంగతనానికి వెళ్లిన ఐదుగురు దొంగలను ఆ ఇంటిలోని ఐదుగురు పిల్లలు హౌస్ అరెస్ట్ చేసి ముప్పు తిప్పలు పెట్టడమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. చిచ్ఛర పిడుగుల్లాంటి సూపర్ కిడ్స్.. వాళ్ళ చేత చిక్కిన దుండగుల బ్యాచ్ మధ్య జరిగిన అల్లరిని చూపిస్తున్న ఈ టీజర్ అన్ని వర్గాలను అలరిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. అ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates