స్త్రీలను గౌరవించడం నేర్చుకో: అమలాపాల్!

తెలుగు, తమిళ బాషల్లో నటిగా రాణిస్తున్న అమలాపాల్, విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే ఆ బంధం తెగతెంపులు కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. అప్పటినుండి అమలాపాల్
పై రోజుకో వార్త వస్తూనే ఉంది. ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్ బుక్ లలో అమలాపాల్ పై కామెంట్స్
చేసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. తాజాగా ఓ ఆకతాయి ‘విడాకులు తీసుకున్న అమ్మాయిలు
హాట్ గా నాటీగా ఉంటారని’ సోషల్ మీడియా ద్వారా అమలాపాల్ పై కామెంట్ చేశాడు. దీంతో
అమలాపాల్ ‘నీ ఆలోచనలు తప్పుడు దారిలో వెళ్తున్నాయి.. స్త్రీలను గౌరవించడం నేర్చుకో అంటూ
ఘాటుగానే స్పందించింది. కానీ తను విజయ్ నుండి ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో..
అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.