సుబ్బిరామిరెడ్డికి అరుదైన అవార్డు!

గత 35 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలతో పాటు డా|| అక్కినేని నాగేశ్వరావు గారు జన్మదిన
కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ.. రసమయి సంస్థ ఇప్పటివరకు 50 మందికి పైగా
నిష్ణాతులను ‘రసమయి డా|| అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో సత్కరిస్తూ వస్తుంది. ఇదే
ఆనవాయితీగా ఈ సంవత్సరం డా|| అక్కినేని నాగేశ్వరావు గారి 93వ జయంతో సంధర్భంగా ఈ అవార్డును కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి గారికి బహూకరించనున్నట్లు రసమయి అధినేత ఎం.కె.రాము తెలిపారు. 21 సెప్టెంబర్ 2016న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి ఆడిటోరియమ్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు వెంకయ్య నాయుడు గారు, సన్మానకర్తగా చెన్నై రాష్ట్ర పూర్వ గవర్నర్ రోశయ్య గారు తదితరులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన, రేఖా చిత్రాల ప్రదర్శన ఉంటుందని ఎం.కె.రాము తెలిపారు.

CLICK HERE!! For the aha Latest Updates