HomeTelugu Trendingఆర్‌ఆర్‌ఆర్‌లో నేను నటించడం లేదు..

ఆర్‌ఆర్‌ఆర్‌లో నేను నటించడం లేదు..

1 16
డైరెక్టర్‌.. ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తాను నటించడం లేదని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ స్పష్టం చేశారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మొదటిసారి కలిసి నటిస్తుండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రంలో సుదీప్‌ ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసు అధికారి పాత్రలో సుదీప్‌ నటించనున్నారంటూ, జనవరి 20 నుంచి ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నటుడు సుదీప్‌ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. తాను ఆర్‌ఆర్‌ఆర్‌లో నటించడం లేదంటూ స్పష్టం చేశారు. ”ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నేను నటిస్తున్నానంటూ గత కొన్నిరోజులుగా సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమైనవి. ఇప్పటివరకూ నన్ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం సంప్రదించలేదు. మాట్లడలేదు.’ అని సుదీప్ ట్వీట్‌ చేశారు. అక్టోబర్‌ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu