HomeTelugu Big Storiesగాలోడులా వస్తున్న సుడిగాలి సుధీర్

గాలోడులా వస్తున్న సుడిగాలి సుధీర్

Sudigaali Sudheer Gaalodu

జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు సుడిగాలి సుధీర్. కేవలం కామెడీతోనే కాకుండా మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నాడు. యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, మెజీషియన్‌గా, నటుడిగా తనలోని మల్టీ టాలెంట్‌తో ముందుకెళ్తున్నాడు. ఇవాళ సుడిగాలి సుధీర్ పుట్టినరోజు సందర్భంగా తాజాచిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ సుధీర్‌, 3 మంకీస్‌ చిత్రాల్లో హీరోగా నటించాడు. తాజగా ‘గాలోడు’ టైటిల్‌తో రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వంలో సుధీర్ ఓ మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ నోట్లో సిగ‌రెట్‌తో చాలా ర‌ఫ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ సినిమా చ‌క్కని క‌థాంశంతో రూపొందుతుంద‌ని, ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu