HomeTelugu Trendingసుధీర్‌ న్యూమూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌

సుధీర్‌ న్యూమూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌

sudigali sudheer new movie

సుడిగాలి సుధీర్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు చిత్రాల్లో హీరోగా నటించిన సుధీర్.. ప్రస్తుతం తన నాలుగో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సినిమానే ‘గోట్’.. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

మహాతేజ క్రియేషన్స్ పతాకంపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో సుధీర్ ఒక చేత్తో క్రికెట్ బ్యాక్ పట్టుకుని, మరో చేత్తో సిగరెట్ కాల్చుతూ మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయ్యింది. రెండు పాటలు చిత్రీకరణ కూడా పూర్తి అయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu