HomeTelugu Newsచిరంజీవి సినిమాలో కీలక పాత్రలో సీనియర్‌ నటి!

చిరంజీవి సినిమాలో కీలక పాత్రలో సీనియర్‌ నటి!

9 18
మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా నటిస్తున్నారు. ఈ సినిమా తరవాత చిరంజీవి ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో సుహాసిని నటించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో వచ్చిన ‘లూసిఫర్’ అక్కడ మంచి విజయాన్ని సాధించింది. దీంతో తన తండ్రితో దీనిని రీమేక్ చేయడానికి హీరో రామ్ చరణ్ సన్నాహాలు చేస్తున్నాడు. ‘సాహో’ ఫేం సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మలయాళం ఒరిజినల్ లో మంజూ వారియర్ పోషించిన కీలక పాత్రకు సీనియర్‌ నటి సుహాసినిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్టుకి మార్పులు చేర్పులు కూడా చేస్తున్నారు. కాగా అపట్లో చిరంజీవి, సుహాసిని జోడీ అంటే పెద్ద క్రేజ్. అప్పట్లో ఇద్దరూ కలసి పలు చిత్రాలలో నటించారు. ఈ కాంబినేషన్లో పలు హిట్ చిత్రాలు వున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu