HomeTelugu Trendingబన్నీని మరింత కొత్తగా చూపించనున్న సుకుమార్‌!

బన్నీని మరింత కొత్తగా చూపించనున్న సుకుమార్‌!

2 4స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా కూడా ప్రారంభించారు.

బన్నీ కోసం సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నాడు. ఇందులో అల్లు అర్జున్ ను చాలా అద్భుతంగా చూపించబోతున్నాడు. బన్నీలో ఉన్న ఎనర్జీని ఫుల్ గా వాడేసేందుకు సిద్ధం అయ్యాడు సుకుమార్. ఇప్పటి వరకు బన్నీని ఎవరూ చూపించని విధంగా ఇందులో చూపించబోతున్నాడు సుకుమార్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. గతంలో వీరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu