HomeTelugu Trendingఅల్లు అర్జున్‌తో విజయ్‌ సేతుపతి..

అల్లు అర్జున్‌తో విజయ్‌ సేతుపతి..

9 9
‘అల వైకుంఠపురంలో’ సినిమా మంచి విజయం సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌ మంచి జోష్‌ మీద ఉన్నాడు. ఈ సినిమా విజయం తరువాత సుకుమార్ తో సినిమా చేస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి సినిమా కావడంతో దీనిపై అంచనాలు పెరిగాయి. సినిమా ఎలా ఉండబోతుందో అనే ఉత్సాహం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ షెడ్యూల్ ఇప్పటికే కేరళలో జరిగింది.

బన్నీ లేకుండానే ఈ షెడ్యూల్ ను సుకుమార్ పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెల మొదటివారం నుంచి ప్రారంభం కాబోతున్నది. వచ్చే నెలలో జరగబోయే షూటింగ్ లో బన్నీ కూడా పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా తీసుకున్నారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి విలన్ పాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఈరోజు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu