HomeTelugu Newsనిఖిల్ నెక్ట్స్ మూవీకి సుకుమార్ కథ

నిఖిల్ నెక్ట్స్ మూవీకి సుకుమార్ కథ

7 2
వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు దర్శకుడు సుకుమార్‌. స్వతహాగా రచయిత అయిన సుకుమార్ ‘కుమారి 21ఎఫ్‌’ సినిమాకు కథ అందించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన కథ, స్క్రీన్‌ప్లే అందించిన మరో చిత్రం పట్టాలెక్కనుంది. ఇందులో నిఖిల్‌ హీరోగా నటిస్తుండటం విశేషం. నిఖిల్‌ ఇప్పటికే ‘అర్జున్‌ సురవరం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ‘కరెంట్‌’ సినిమాతో విజయాన్ని అందుకుని, ‘కుమారి 21ఎఫ్‌’తో మేజిక్‌ చేసిన దర్శకుడు పలనాటి సూర్య ప్రతాప్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. బన్ని వాసు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. దర్శకుడిగా సుకుమార్‌ ఓ పక్క అగ్ర హీరోలతో సినిమాలు తీస్తూనే, మరోవైపు నిర్మాతగా యువ దర్శకులు, హీరోలతో సినిమాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu