HomeTelugu Big Storiesబిగ్‌బాస్‌: సుమ వైల్డ్‌ కార్డు ఎంట్రీ

బిగ్‌బాస్‌: సుమ వైల్డ్‌ కార్డు ఎంట్రీ

Suma wild card entry in Big
తెలుగు బిగ్‌బాస్‌-4 లో ఇప్పటికే ముగ్గురు వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా మరో వైల్డ్‌కార్డు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపధ్యంలో స్టార్‌ యాంకర్ సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ‘స్టార్ మా’ తాజాగా ఓ ప్రోమో విడుదల చేసింది. ఈ ప్రోమోలో సుమ తన సూట్ కేసుతో స్టేజ్‌ పై ఎంట్రీ ఇచ్చింది. దీనికి నాగ్‌ కూడా ఆశ్చర్యంగా ఎలా ఒప్పుకున్నావు అని అడిగాడు. సుమ ఏం చేయాలీ సార్.. పాండ మిక్ అలా చేయించింది అని చెప్పింది. స్టేజ్‌పై ఎంట్రీ ఇచ్చిన సుమ వరుసగా అందరిపై పంచులు వేసింది. దీంతో బిగ్‌బాస్‌ హౌస్‌ మొత్తం నవ్వులతో నిండిపోయింది. అయితే సుమ నిజంగానే బిగ్‌బాస్‌ హౌస్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇస్తుందా.. లేదా ప్రమోషన్‌లో భాగంగా వచ్చాందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఇంట్లోనుంచి ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అందులో భాగంగా ఈరోజు అమ్మా రాజశేఖర్ ఎలిమినేట్
అయ్యాడని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu