హృతిక్‌ భార్య కూడా ముస్లిమే కదా!

‘హృతిక్‌ రోషన్‌ కూడా ముస్లిం యువతినే పెళ్లి చేసుకున్నాడుగా.. మరి నాతో ఏంటి సమస్య?’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రుహైల్ అమిన్‌. హృతిక్‌ సోదరి సునైనా, రుహైల్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రుహైల్‌ ముస్లిం కావడంతో రోషన్‌ కుటుంబీకులు వీరి ప్రేమకు అంగీకరించడంలేదు. సునైనాను కొట్టి గృహనిర్బంధం చేశారు. ఈ విషయం గురించి రుహైల్‌ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.

ఇది చాలా దురదృష్టకరం. ముస్లిం మతానికి చెందినవాడినైనంత మాత్రాన నాపై తీవ్రవాది అని ముద్రవేయడం సరికాదు. ఇలా ఆలోచించేవారికి ఘాటు వ్యాఖ్యాలతోనే సమాధానం చెప్పాలి. తీవ్రవాదం అనేది మతాలు, ప్రాంతాలపై ఆధారపడి ఉండదు. ఇలాంటి ఆలోచనా విధానంలో మార్పు రావాలి. హృతిక్‌ పెళ్లి చేసుకున్న సుజాన్నే ఖాన్‌ కూడా ముస్లిమే కదా. మరి నాతో ఆయనకు వచ్చిన సమస్యేంటి? ఎందుకు సునైనాను, నన్ను అంగీకరించడంలేదు? ఎందుకు ఆమెను అభద్రతా భావానికి గురిచేస్తున్నారు? ఆమె నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటోంది. ఒక అవకాశం ఇచ్చి చూడండి.’ అని వెల్లడించారు రుహైల్‌. రోషన్‌ కుటుంబానికి చెందిన వ్యక్తిగత విషయాలు ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.