HomeTelugu Trendingవిజయ్‌ దేవరకొండ తండ్రిగా బాలీవుడ్‌ స్టార్‌!

విజయ్‌ దేవరకొండ తండ్రిగా బాలీవుడ్‌ స్టార్‌!

Suniel Shetty as a Vijay Deటాలీవుడ్‌ క్రేజీ హీఈరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు “ఫైటర్” అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే సినిమాలోని మెజారిటీ పార్టీ ముంబైలోనే చిత్రీకరించారు. ఈ కథ నచ్చి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా కోసం పూరీజగన్నాద్ ఇటీవలే బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టితో సంప్రదింపులు జరిపాడట. ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ తండ్రిగా సునీల్ శెట్టి నటిస్తున్నారని ఆయనది డాన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన లెంగ్త్ ఓ 15 నిమిషాలపాటు ఉండొచ్చని సమాచారం. ఇక సునీల్ ఈ ఏడాది దర్బార్ సినిమాలో రజినీకి విలన్ గా మెప్పించిన విషయం తెలిసిందే. అలాగే మంచు విష్ణు ‘మోసగాళ్లు’ సినిమాలో కూడా నటిస్తున్నారు.

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu