HomeTelugu Trendingతీస్ మార్ ఖాన్: సునీల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

తీస్ మార్ ఖాన్: సునీల్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల

Sunil first look from tees
టాలీవుడ్‌ నటుడు సునీల్.. మరోసారి వినూత్న పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆది సాయికుమార్.. పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘నాటకం’ వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు అందరినీ మెప్పించాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరొక అప్‌డేట్‌ వచ్చింది. సునీల్ పాత్రకు సంబంధించిన కారెక్టర్ పోస్టర్‌ను మేకర్లు విడుదల చేశారు. సునీల్ ఈ సినిమాలో ‘చక్రి’ అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సునీల్ సీరియస్‌గా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించాడు.

Sunil’s First Look From Tees Maar Khan Is Intriguing

Recent Articles English

Gallery

Recent Articles Telugu