HomeTelugu Trending'మండేలా' తెలుగు రీమేక్‌లో సునీల్‌!

‘మండేలా’ తెలుగు రీమేక్‌లో సునీల్‌!

Sunil in Mandela Telugu rem

తమిళ సూపర్ హిట్ మూవీ ‘మండేలా’ను తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో ఇటీవలే విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా టాలీవుడ్ రీమేక్ హక్కులను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర దక్కించుకున్నారు. అయితే తమిళంలో కమెడియన్ యోగిబాబు ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో తెరకెక్కింది. కానీ సినిమా మొత్తానికి వివాదాలతో పాటుగా సూపర్ హిట్ అందుకొని విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. అలాగే నటుడు యోగిబాబు కూడా ఈ సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాను టాలీవుడ్‌ నటుడు కం కమెడియన్ సునీల్ తో రూపొందించాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇంకా..అధికారికంగా ప్రకటన రావల్సి ఉంది. దాపుపు సునీల్ పేరు ఖరారు అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu