HomeTelugu Trendingబాలయ్యకు విలన్‌గా సునీల్‌!

బాలయ్యకు విలన్‌గా సునీల్‌!

12a

నందమూరి బాలయ్యకృష్ణ సినిమా ఎంత పవర్ ఫుల్‌గా, యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుందో తెలిసిందే. ఆయనతో ఢీకొట్టాలంటే విలన్‌ పాత్ర కూడా అదే రేంజ్‌లో ఉండాలి. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలయ్య త్వరలోనే బోయపాటి చిత్రంతో బిజీ కానున్నాడు. రూలర్ సినిమా తర్వాత కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న ఈయన ఇప్పుడు గెటప్ కూడా మార్చేస్తున్నాడు. ఈ మధ్యే బోయపాటి సినిమా కోసం పూర్తిగా కొత్త లుక్‌లోకి మారిపోయాడు బాలయ్య. అంతేకాదు ఈ చిత్రం కోసం బరువు కూడా భారీగానే తగ్గించేశాడు సింహం.

రూలర్ సినిమా కోసమే దాదాపు 11 కేజీలు తగ్గిన బాలయ్య ఇప్పుడు బోయపాటి కోసం మరో 10 కేజీలు తగ్గిపోతున్నాడు. ఈ సినిమా కోసమే తనను తాను చాలా మార్చుకుంటున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్‌గా ఎవరు నటిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. లెజెండ్ సినిమాతో జగపతిబాబుకు లైఫ్ ఇచ్చిన బోయపాటి.. ఇప్పుడు మరోసారి కొత్త విలన్‌ను చూపించాలని ఫిక్సైపోయాడు. రాజశేఖర్ లాంటి హీరోల పేర్లు కూడా వినిపించాయి కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం కమెడియన్ సునీల్ ఇందులో కీలక పాత్రలో నటించబోతున్నాడు. అయితే ఈయన చేయబోయే పాత్ర కమెడియన్ కాదు విలన్ అనే ప్రచారం కూడా జరుగుతుంది.

ఈ మధ్యే విడుదలైన రవితేజ డిస్కో రాజా సినిమాలో ఈయన విలన్‌ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు.. దాంతో సునీల్ విలన్ అవతారం ఎవరూ పెద్దగా గుర్తు పెట్టుకోలేదు.. గుర్తింపు కూడా రాలేదు. కానీ బాలయ్య సినిమాలో విలన్‌‌గా నటిస్తే మాత్రం రచ్చ మామూలుగా ఉండదు. అందులోనూ బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఇదే చేయబోతున్నాడని తెలుస్తుంది. పైగా తనకు విలన్ రోల్స్ అంటే మహా ఇష్టమని.. తాను అది చేయాలనే ఇండస్ట్రీకి వచ్చానని చాలా సార్లు చెప్పాడు సునీల్. మరి ఇది ఎంతవరకు నిజమో.. చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu