కరోనా ఎఫెక్ట్‌: స్కెచ్‌ వేసిన సల్మాన్‌

కరోనా నివారణ చర్యల్లో భాగంగా పలు సినిమా షూటింగ్స్‌ను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. షూటింగ్స్‌ నుంచి కొంత బ్రేక్‌ దొరకడంతో పలువురు నటీనటులు సోషల్‌మీడియా వేదికగా ‘కొవిడ్‌-19’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి తెలియచేస్తూ పలు వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. మరికొంతమంది నటీనటులు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో ఇంట్లోనే సరదాగా సేద తీరుతున్నారు.

తాజాగా బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన తదుపురి చిత్రం ‘రాధే’ షూటింగ్‌ వాయిదా పడడంతో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా తనలోని మరో యాంగిల్‌ను బయటపెట్టారు. ఈ మేరకు ఆయన ఓ పెయింటింగ్‌ వేసి దాని వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ స్కెచ్‌ చూసిన అభిమానులు ‘వావ్‌.. సల్మాన్‌’, ‘సూపర్‌ సల్లూబాయ్‌’ అని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/tv/B95Pg0-lI6d/?utm_source=ig_web_copy_link