HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ సినిమాలో కీలక పాత్రలో సునీల్‌!

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో కీలక పాత్రలో సునీల్‌!

5 3
హాస్యనటుడి గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సునీల్. కమెడియన్ గా మంచి ఫామ్ లో ఉండగానే హీరోగా మారాడు. అయితే హీరో గా సునీల్ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో తిరిగి కామెడీ చేద్దామన్న వర్కౌట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం సునీల్ విలన్ అవతారం ఎత్తాడు. రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ సినిమాలో విలన్ గా నటించాడు సునీల్ . త్వరలో రాబోతున్న ‘కలర్ ఫోటో’ సినిమాలో కూడా విలన్ గా నటించనున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. పవన్ తో పాటు ఎక్కువసేపుండే పాత్రను సునీల్ కోసం క్రిష్ క్రియేట్ చేశాడట. అయితే ఈ సినిమాలో సునీల్ ఏ రోల్ చేస్తాడా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి విలన్ కమ్ కమెడియన్ కమ్ సపోర్టింగ్ యాక్టర్ గా సునీల్ ఎంతవరకు రాణిస్తాడో వేచి చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu